త్రాగునీటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

త్రాగునీటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
- విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, ఆంధ్ర ప్రభ: వేసవి కాలం దృశ్య త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా జక్కంపూడి కాలనీ పర్యటించి క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ, భూగర్భ డ్రైనేజ్, త్రాగునీటి సరఫరా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ… అధికారులందరూ క్షేత్ర స్థాయి లో పర్యటించి జక్కంపూడి లో ఎటువంటి భూగర్భ డ్రైనేజ్, త్రాగునీటి సరఫరా పారిశుధ్య నిర్వహణలో సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అన్నారు.
డ్రోన్లతో పర్యవేక్షిస్తూ జె ఎన్ ఎన్ యు ఆర్ యం అపార్ట్మెంట్లు పైనున్న ట్యాంకుల మూతలు ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ లేనిచో వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. త్రాగు నీటి సరఫరాలో ఎటువంటి లోపం ఉండ రాదని ముఖ్యంగా వేసవి కాలంలో జక్కంపూడి ప్రజలకు త్రాగునీటి సరఫరా లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) వి.చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు.
