నవజాత శిశువు అత్యవసర వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత…
నవజాత శిశువు అత్యవసర వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత…
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్ ఓ సీ
(లెటర్ ఆఫ్ క్రెడిట్) ను గురువారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు.. 51 వ డివిజన్ కు చెందిన అనంత లక్ష్మి (21) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చింది.
ప్రతికూల గర్భధారణ వలన శిశువు అత్యవసర వైద్యం కోసం ఎన్డీఏ కార్యాలయంలో ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేశారు.మంజూరైన రూ 6 లక్షల 18 వేల ఎల్ ఓ సీ ను కూటమినేతలతో కలిసి అందజేశారు.త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరు సాయి శరత్, దుర్బేసుల హుస్సేన్, డాక్టర్ హనుమంతరావు, పోలవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు..
