మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు
కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్
వేద ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.

పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య మహేష్ కుమార్ గౌడ్ దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


