ఘనంగా రాష్ట్ర డీబీఎఫ్ నేత జన్మదిన వేడుకలు
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : తెలంగాణ దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో.. రమేష్ ను 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా దళిత బహుజన కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ… మహనీయుల స్పూర్తితో దళిత బహుజనుల ఉద్దరణకు పాటుపడాలని రమేష్ కు గుర్తు చేశారు. గత 25 ఏళ్ల కుపైగా పీడిత ప్రజల హక్కులకై శ్రమిస్తున్నరమేషన్న, భవిష్యత్ లో మరెన్నో సేవలందించి, అందరి మన్ననలను పొందాలని కోరారు. ఈకార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంచు రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ మాదా సురేష్, పూలే అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు క్రీడల ప్రసాద్, జిల్లా కార్యదర్శి మాదాసి సుదర్శన్, గూడపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
