ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు

  • పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ దశదినకర్మలో పాల్గొన్న సీఎం

మోయినాబాద్, ఆంధ్రప్రభ : శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ దశదినకర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం మొయినాబాద్‌లోని జేపీఎల్ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రుక్కమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రుక్కమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.