రెవెన్యూ మంత్రిను కలిసిన విక్కుర్తి శ్రీనివాసరావు..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని మంత్రి కార్యాలయంలో ఆదివారం ఆయనను కలిసి పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ విక్కుర్తి శ్రీనివాసరావుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.