Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..

Narendra Modi | క్యాబినెట్ మంత్రులతో ప్రధాని కీలక సమావేశం
పరీక్షల్లో పారదర్శకతకు కొత్త చట్టానికి కసరత్తు

Narendra Modi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీక్ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం క్యాబినెట్ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించి, పేపర్ లీక్‌ల నివారణకు తీసుకురానున్న ప్రత్యేక బిల్లుపై విస్తృతంగా చర్చించారు.

పరీక్షల నిర్వహణలో పారదర్శకతను మరింత పెంచడం, ప్రశ్నపత్రాల లీక్‌లకు పాల్పడే వ్యక్తులు, ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో కీలక సంస్కరణలు తీసుకురావడంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఈ బిల్లులో లీక్‌లకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు, పరీక్షల భద్రతను మరింత బలోపేతం చేసే నిబంధనలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు త్వరలో కేంద్ర మంత్రివర్గం తుది ఆమోదం తెలిపిన అనంతరం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.