పేదింటి పెద్దన్న సీఎం రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్ / ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ ; నిరుపేదల కు సొంతింటి కళ సహకారం చేసింది ప్రజా ప్రభుత్వం దేనని, పేదింటి పెద్దన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఖానాపూర్ ఎమ్మెల్యే విడుమ బొజ్జు పటేల్ అన్నారు. ఆయన శుక్రవారం ఉట్నూర్ మండలంలోని చాందూరి ,నాగపూర్, ఉట్నూర్ మండల కేంద్రంలోని ఫకీర్ గుట్టలో ఇందిరమ్మ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంటి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రారంభించిన ఎమ్మెల్యేకు నూతన ఇందిరమ్మ ఇండ్ల కుటుంబ యజమానులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతి పేదవారి కల నెరవేరుతుందని మహిళలు ఆర్ధికంగా స్థిరపడుతున్నారని, నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతున్నారని,విద్యార్థులు ఉన్నత విద్య చదువుతూ మంచి భవిష్యత్ వైపు అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
మరెన్నో అబివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని , సంక్షేమ పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకం అన్నారు . ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు , అధికారులు , కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, నాగపూర్, చందూరి సర్పంచులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ లబ్దిదారులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
