న్యాయవాది నేడూరి లలితకుమారికి వెండి పతకం
అత్యధిక బెయిల్ డిపాజిట్‌కు గుర్తింపుగా అవార్డు
కడెం, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని మనోరంజన్ కోర్టులో వివిధ నేరాలకు సంబంధించిన బెయిల్ అమౌంట్‌ను అత్యధికంగా డిపాజిట్ చేసినందుకు అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్, మనోరంజన్ కోర్టు సభ్యురాలు, ఖానాపూర్‌కు చెందిన న్యాయవాది నేడూరి లలితకుమారిని వెండి పతకానికి ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా నేడూరి లలితకుమారికి వెండి పతకం ప్రకటించడంపై ఖానాపూర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.
ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది మట్టెరి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసుల రాజలింగం, న్యాయవాది శివ తదితరులు లలితకుమారిని అభినందించారు. ఖానాపూర్‌కు చెందిన న్యాయవాదులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
