Vijayawada | గుణదల పడవలరేవు సెంటర్‌లో ఉద్రిక్తత

Vijayawada | గుణదల పడవలరేవు సెంటర్‌లో ఉద్రిక్తత

నీటి తరలింపును నిరసిస్తూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆందోళన
పైప్‌లైన్ పనులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్
గోతిలో దిగి నిరసన తెలిపిన నేత.. భారీగా పోలీసుల మోహరింపు

Vijayawada | ఆంధ్రప్రభ విజయవాడ : విజయవాడ లోని గుణదల పడవలరేవు సెంటర్‌లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుణదల, మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే తాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు.నీటి తరలింపు కోసం ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ నిర్మాణం కోసం తవ్విన గోతిలోకి దిగిన దేవినేని అవినాష్ తన నిరసనను తెలియజేశారు. స్థానిక ప్రజల అవసరాలను పక్కనబెట్టి నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించడం సమంజసం కాదని ఆయన ఆరోపించారు. ఆందోళన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. స్థానిక ప్రాంతాలకు నీటి సరఫరాపై స్పష్టత ఇవ్వాలని, ప్రజల అవసరాలకు ప్రాధాన్యం కల్పించాలని దేవినేని అవినాష్ ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply