75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
75 percent | IIIT, JEE,NEET ల్లో ఉచిత శిక్షణ
సీఓఈ కాలేజీల్లో అడ్మిషన్లు
ఆన్ లైన్ లో ధరఖాస్తులు
అప్లికేషన్లకు ఆఖరి గడువు జూలై 30
APSWREIS . జాయింట్ సెక్రటరీ డాక్తర్ ఐ. శ్రీదేవి
75 percent | అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE) కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ, లలో ఉచిత శిక్షణతో కూడిన జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) డా. ఐ. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని మేఘాద్రిగడ్డ (విశాఖపట్నం జిల్లా), అమరావతి-తాడికొండ (గుంటూరు జిల్లా), కోట (SPSR నెల్లూరు జిల్లా) లలోని మూడు ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్స కేంద్రాలలో ఈ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. మార్చి 2026లో జరిగిన 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణులై, కనీసం 85 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అర్హులని, మార్చి 2026 జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కేంద్రాల్లో నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు ప్రముఖ శిక్షణ సంస్థల అధ్యాపకులచే సమగ్ర ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్, పూర్తి ఉచిత వసతి, పౌష్టికాహార భోజనం స్టడీ మెటీరియల్‌ను అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మొత్తం సీట్లలో 75శాతం సీట్లు షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు, 25శాతం సీట్లు ఇతర వర్గాల (OC, ST, BC) విద్యార్థులకు కేటాయిసక్తారని ఆమె స్పష్టం చేశారు.
