ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంతో రైతులకు లాభం

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంతో రైతులకు లాభం
- మున్సిపల్ చైర్ పర్సన్ సునీత వెంకన్న
కేసముద్రం, ఆంధ్రప్రభ : ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న అన్నారు. శుక్రవారం కేసముద్రం వ్యవసాయం మార్కెట్ లో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ టి. జి. ఆయిల్ ఫెడ్ సహకార శాఖ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని అతిథిగా కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఈ కేంద్రం ప్రారంభంతో మన రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ పంట పండించే రైతులకు తమ దిగుబడిని సమీపంలోనే సులభంగా విక్రయించే అవకాశం కలుగుతుంది.
ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి మార్కెట్ ఇబ్బందులు, కోతులు, కుక్కలు, దొంగలు బెడదలేని, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ఆయిల్ పామ్ పంట రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఎకరానికి లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని తెలిపారు. మున్సిపాలిటీ తరఫున రైతులకు అవసరమైన సహాయం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు. ఈ కార్యక్రమానికి కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దబోయిన ఐలమల్లు , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు డిహెచ్ఎస్ఓ మరియన్న , జిల్లా ఆయిల్ పేడ్ ఇన్చార్జ్ చిలువేరు దయాకర్ , కేసముద్రం తాసిల్దార్ గుండు వివేక్, మార్కెట్ ప్రత్యేక హోదా కార్యదర్శి అమర లింగేశ్వరరావు, ధనసరి సొసైటీ సీఈఓ జి మల్లారెడ్డి , మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కేసముద్రం బి వెంకన్న , ఉద్యానవన అధికారినీ శాంతి ప్రియదర్శిని, వార్డ్ కౌన్సిలర్స్ వలందాసు ఉమారవి, తరాల వీరేష్ యాదవ్, పావిరాల శరత్ యాదవ్, ఆగే రాము, రావుల వినయ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్స్ ఎండీ అయ్యూబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు జాటోథ్ హరీష్ నాయక్, కాంగ్రెస్ ఇనుగుర్తి మండల అధ్యక్షులు కూరెల్లి సతీష్, రైతు నాయకులు బొబ్బల యాకుబ్ రెడ్డి, సంకపెల్లి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు , మండల నాయకులు, సర్పంచులు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
