రాహుల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ఇంజనీర్లపై సీఎం వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్..
రేవంత్‌తో పాటు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి
ఇంజనీర్లపై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ స్పందించాలని విజ్ఞప్తి
విద్యార్థులు, ఇంజనీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ మౌనం ఎందుకని ప్రశ్నించిన కేటీఆర్
యువతపై వ్యాఖ్యలు వివాదాస్పదం.. కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఇంజనీర్లు ప్రతిభ చాటుతూ దేశ ప్రతిష్ఠను పెంచుతున్న సమయంలో వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించడం రాహుల్ గాంధీ నైతిక, రాజకీయ బాధ్యత అని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటివరకు స్పందించకపోవడం, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించినట్టేనని విమర్శించారు. యువత, విద్యార్థులు, ఇంజనీర్లు, అధ్యాపకుల పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు. దేశ అభివృద్ధికి ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. రేవంత్ రెడ్డి గతంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ యువత, విద్యార్థులు ఈ పరిణామాలను గమనిస్తున్నారని, ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ గౌరవించాలని సూచించారు.
