మద్యం సేవించి రోడ్డు దాటుతుంటే..

మద్యం సేవించి రోడ్డు దాటుతుంటే..
చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని సుభాని నగర్ పాత అయ్యప్ప స్వామి గుడి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. హైవే పెట్రోలింగ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుభాని నగర్‌కు చెందిన వెంకట్రావు (40) మద్యం సేవించి రోడ్డు దాటే క్రమంలో వరిపొట్టు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వెంకట్రావు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
