చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్..

చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయన మావయ్య అంటూ సంబోధించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండైన ఆరోగ్యం, సంతోషం, బలంతో ప్రజాసేవలో అదే దార్శనికత, అంకితభావంతో పని చేయాలని ఆశిస్తున్నాను. రాష్ట్రం అభివృద్ది, సుసంపన్నత, ఆత్మ గౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మొత్తానికి, ఎన్టీఆర్ చేసిన ఈ ఒక్క ట్వీట్‌తో “మావయ్య” అన్న పదం ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply