కువైట్‌లో గుండెపోటుతో రామన్నపేట్ వాసి మృతి..

కువైట్‌లో గుండెపోటుతో రామన్నపేట్ వాసి మృతి..
వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ మండలం రామాన్నపేట్ గ్రామానికి చెందిన మాదిగ సంఘం మాజీ అధ్యక్షులు, ఏ వై ఎస్ కార్యవర్గ సభ్యుడు కనుక అశోక్ శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. బతుకుతెరువు కోసం కొని రోజుల క్రితం కువైట్ లో దేశానికి వెళ్లాడు.
అక్కడ శనివారం రాత్రి గుండెపోట్ రావడంతో అక్కడ మరణించిన విషయం తెలిసిన వెంటనే కుటుంబంలో విషాదం నెలకొంది. కువైట్ నుంచి మృతదేహం రావాల్సి ఉంది. మృతుడికి భార్య,కొడుకు,కూతురు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
