వృద్ధాశ్రమంలో అన్నదానం
చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ: ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ పల్నాడు జిల్లా మేనేజర్ శిఖా కొల్లి ఫణి కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక చీరాల రోడ్డులోని బాపూజీ వృద్ధాశ్రమంలో ఆదివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు బ్యూరో షేక్ అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. జిల్లాలోని విలేకరులకు ప్రోత్సాహం అందిస్తూ, విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా మేనేజర్ ఫణి కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఫణి కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు ప్రాంతాల రిపోర్టర్లు మురికిపూడి ప్రసాద్, వెంకట్రావు, నాగచౌదరి పాల్గొని ఫణి కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఫణి కుమార్‌కు హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు.
