- పరకామణి కేసులో ప్రత్యర్థులు హత్య చేశారని ఫిర్యాదు
- సతీష్ సోదరుడు హరి ఫిర్యాదు మేరకు కేసు
TTD | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : సంచలనంగా మారిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య(Satish Kumar Murder) పై గుత్తి రైల్వే పీఎస్‍లో బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు. సతీష్ కుమార్ ప్రయాణించిన రైలు కోచ్‌లోని ప్రయాణికుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. రాత్రి అనంతపురంలో సమీక్ష చేసిన సీఐడీ ఇన్‍స్పెక్టర్ (CID Inspector) సతీష్ కుమార్‌ది ముమ్మాటికీ హత్యే అని బంధువులు ఆయన దృష్టికి తెచ్చారు. డ్రగ్స్ ఇచ్చి హత్య చేసి ఉంటారనే కోణంలోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
సతీష్ కుమార్ హత్య నేపథ్యంలో సీఐడీ, రైల్వే పోలీసులతో 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సతీష్ కుమార్ సెల్ ఫోన్‍ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం వచ్చిన సీఐడీ విభాగం డీజీ రవిశంకర్ అయ్యన్నార్ చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతపురంలో ఆర్‌అండ్‌బీ (R&B) అతిథిగృహంలో పోలీసు ఉన్నతాధికారులతో సీఐడీ డీజీ భేటీ అయ్యారు. సతీష్‌కుమార్ మృతిపై దర్యాప్తు చేయాల్సిన కోణాలపై అధికారులకు సీఐడీ డీజీ సూచనలు చేశారు. దర్యాప్తులో భాగంగా గతంలో కీలక హత్య కేసులు, సైబర్ నేరాల కేసులను విచారించిన అధికారులను నియమించారు.

