విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు

విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు

ఘంటసాల – ఆంధ్రప్రభ : విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను ఘంటసాల మండలం కొడాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌదరి బాబు టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పార్టీ అభిమానులకు తినిపించారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు 76 సంవత్సరాల వయస్సులో కూడా శ్రమిస్తున్న నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గత ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి దశ దిశ లేని సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించేలా కృషి చేస్తున్న నిత్య కృషివలుడు చంద్రబాబు అని కొనియాడారు. ప్రజా సంక్షేమాన్ని, రాజధాని అమరావతి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని గుర్తు చేసుకున్నారు. నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటూ… రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, పరిసే చలపతి, గుత్తికొండ వరప్రసాద్, ముప్పనేని రవి ప్రసాద్, అత్తలూరి గోపీచంద్, కుంపటి సుబ్బారావు, కంఠమనేని రాజగోపాల్, తుమ్మల నందీశ్వరరావు, వీరంకి నాగరాజు, దోనేపూడి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.