సామినేని ఉదయభానుకు విశేష ప్రజాభిమానం..

  • జన సంద్రం.. ఉదయభాను నివాసం
  • ఘనంగా ఉదయభాను జన్మదిన వేడుకలు
  • ఉప్పొంగిన జనాభిమానం
  • పలు జిల్లాల నుండి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు
  • మీ అభిమానానికి రుణపడి ఉంటా
  • జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జనసంద్రంగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను నివాసం మారింది. ఆదివారం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను జన్మదిన సందర్భంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉదయభాను నివాసానికి విచ్చేసి ఉదయభాను కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఉదయభాను భారీ కేక్ కట్ చేసి విచ్చేసిన వారికి స్వీట్స్ అల్పాహారం అందజేశారు.

తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు నియోజకవర్గము నుండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి విచ్చేసిన వారితో ఉదయం నుండి ఉదయభాను నివాస ఆవరణ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా, గుంటూరు ,పల్నాడు, కాకినాడ, తెలంగాణ రాష్ట్రం నుండి సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్నగర్ మల్లారెడ్డి గూడెం తదితర ప్రాంతాల నుండి తరలివచ్చిన వారు ఉదయభాను కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

గజమాలలను , భారీ కేకులు తీసుకువచ్చి ఉదయభాను తొక్కే కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలు సేవా కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. పలు దేవాలయాల నుండి విచ్చేసిన వేద పండితులు అర్చకులు వేదమంత్రోత్సవాల మధ్య ఉదయభానుపు ఆశీర్వచనాలు అందజేశారు. పండుగ వాతావరణం నడుమ జరిగిన ఈ జన్మదిన వేడుకలలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు

మీ అభిమానానికి రుణపడి ఉంటా..

మీ అభిమానానికి రుణపడి ఉంటానని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అభిమానులు అన్నదాన కార్యక్రమాలు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు.