ఈసారి ఎన్నికలలో అక్కడ బిజెపి కూటమిదే అధికారం
జమిలీ ఎన్నికలకే తన మద్దతు
ప్రతిసారి ఎన్నికలతో ప్రజా ధనం వృధా
సిఎం స్టాలిన్ కూడా దీనిపై ఆలోచించాలి
కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్ కు అభినందనలు
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ సదస్సులో పవన్ ఉద్ఘాటన
చెన్నై – తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికలలో బిజెపి కూటమి విజయం సాధించడం తధ్యమని అన్నారు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ . తమిళనాడు ఎన్నికల్లో అవసరమైతే ప్రచారం చేస్తానని అంటూ ఎన్డీయే కూటమి గెలుపు కోసం పని చేయడానికి తాను ఎన్నడూ సిద్ధమేనని తేల్చి చెప్పారు..
చెన్నైలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ వర్క్ షాపులో జనసేన సేనాని పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాతీయ కన్వీనర్ అనిల్ ఆంథోనీ, బీజేపీ తమిళనాడు నేతలు అర్జున మూర్తి, చక్రవర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ, జమిలిపై స్టాలిన్ తననిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు..తరచూ ఎన్నికల వల్ల కేంద్రంపై భారం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.. సినిమాలువేరు,రాజకీయాలు వేరు అని అంటూ కొత్త పార్టీ పెట్టిన హీరో విజయ్‌కు శుభాకాంక్షతెలిపారు..
ఇక ఈవీఎంలపై వైసీపీకి ఓ విధానం లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.. 2019లో వైసీపీ గెలిచింది కూడా ఈవీఎంలతోనే అని గుర్తు చేశారు. సనాతన ధర్మంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశమే సనాతన ధర్మ భూమి అని అంటూ మన దేశంలో రామాలయం లేని ఊరు లేదని చెప్పారు.
వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ … కరుణానిధి కల ..

వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది.. దేశానికి, తమిళనాడుకు కొత్తదేమీ కాదు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన ధినేత పవన్ కల్యాణ్.. 1952-67 వరకు దేశంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి… వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కోరుకున్నది మాజీ సీఎం దివంగత కరుణానిధి .. ఇప్పుడు వారి కూమారుడు స్డాలిన్ వద్దు అంటున్నారు అని మండిపడ్డారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగదు అన్నారు పవన్ కల్యాణ్.. అందుకు ఉదాహరణే గత రెండు ఎన్నికలలో ఏపీ, తెలంగాణ ప్రాంతీయ పార్టీ గెలుస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు గెలిచింది.. ఏపీలో 2014 టీడీపీ, 2019లో మరో పార్టీ గెలిచింది.. గత ఎన్నికలలో కూటమీ ప్రభుత్వం ఎంపీ, అసెంబ్లీలో ఎన్నికలలో గెలిచింది.. ఆ గెలుపు ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి అని గుర్తుచేశారు.. ఒడిస్సా, తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి… అక్కడ బీజేపీ లబ్ధి పొందలేదు.. ఆశించినంత గెలవలేదు కదా..? అని ప్రశ్నించారు. కానీ, ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని డీఎంకే చెప్పడం విడ్డురంగా ఉందన్నారు..
ఇక, వన్ నేషన్ ,వన్ ఎలక్షన్ పై కరుణానిధి పుస్తకంలో రాశారు… డీఎంకే అధినేత స్టాలిన్ ఒకసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై పునరాలోచించుకోవాలని సూచించారు.. నేను దక్షిణాదినేతనే… నేను ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు నే… అంతిమంగా ప్రజలకు ఏది మంచి జరుగుతుందో ఆ దిశగానే ఆలోచించాలి.. వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించకూడదు.. ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కరుణానిధి కళ… ఆయన డ్రీమ్ అది… దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోటా ఎన్నికల జరగడం వల్ల ఇబ్బందులు పడాల్సివస్తోంది… దానివల్ల డబ్బులు, టైం, అభివృద్ధి పై ఎఫెక్ట్ పడుతుంది.. వాటి అన్నిటికి చెక్ పెట్టడానికే వన్ నేషన్, వన్ ఎలక్షన్.. ఎప్పుడు ఎలక్షన్లో ఉండడంవల్ల అధికారులు నేతలు దానిపైనే దృష్టి పెడుతున్నారు… దానివల్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు..