Vijayawada | జనసేనలో చేరేవారికి సముచిత స్థానం
Vijayawada | జనసేనలో చేరేవారికి సముచిత స్థానం
- జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు
- సామినేని ఉదయభాను
- జనసేన పార్టీలో చేరిన మైనార్టీ నేత షేక్ గయాజుద్దీన్
Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : జనసేన పార్టీలో చేరే వారికి సమచితస్థానం ఉంటుందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు షేక్ గయాజుద్దీన్ జనసేన పార్టీలో చేరారు. ఈసందర్భంగా సామినేని ఉదయభాను, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసు లు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఉదయభాను మాట్లాడుతూ… జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను చూసి ఇటీవల విజయవాడ నగరం నుండి జనసేన పార్టీలో చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. జనసేన పార్టీలో అన్నివర్గాల వారికి సమచిత స్థానం లభిస్తుందన్నారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీ రోజురోజుకు బలపడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచన, ఆచరణ విధానాలను చూసి పార్టీలో అనేకమంది చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
