పరామర్శ పేరుతో బలప్రదర్శనలు

  • నిందితులను కాపాడటమే జగన్‌ రాజకీయమా?
  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : పరామర్శ పేరుతో రాజకీయ డ్రామాలు, బలప్రదర్శనలు చేయడం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నైజంగా మారిపోయిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. నేరస్తులను పరామర్శించేందుకు యాత్రలు చేస్తూ, అదే సమయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించడం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని అన్నారు. గొడ్డలి పార్టీ వ్యవహారం రోజురోజుకూ దిగజారుతోందని, వారి బరితెగింపు, డ్రామాలు, పోకడలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.

ఈ మేరకు గురువారం మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈరోజు ఒక నేరస్తుడిని పరామర్శించేందుకు మరో నేరస్తుడు చేపట్టిన డ్రామా యాత్ర ప్రజల్లో వెగటు- పుట్టించిందన్నారు. ఒక తప్పును సమర్థించేందుకు వెళ్లి, అదే దారిలో తన సైకో మూకతో మరిన్ని తప్పులు చేయించడం జగన్‌ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

వైసీపీ అంటేనే క్రిమినల్స్‌ను తయారు చేసే రాజకీయ ఫ్యాక్టరీగా మారిపోయిందని, ఆ పార్టీలో గుర్తింపు పొందాలంటే నేరాలు చేయాలి, ఫేక్‌ ప్రచారాలు చేయాలి, సమాజానికి నష్టం చేయాలనే పరిస్థితిని జగన్‌ సృష్టించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు చూస్తే అది రాజకీయ పార్టీనా లేక రౌడీ మూకనా అనే సందేహం కలుగుతోందన్నారు. మహిళా పోలీసులను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించడం, దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రాళ్ల దాడులు చేయడం అత్యంత హేయమైన చర్యలని ఖండించారు.

జైలు నిబంధనల గురించి బాగా తెలిసి ఉండాల్సిన వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డేనని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. 18 నెలలు జైలులో ఉన్న వ్యక్తికి ములాఖత్‌కు నిర్ణీత సమయాలు ఉంటాయన్న కనీస అవగాహన కూడా లేదా అని ప్రశ్నించారు. నిజంగా పరామర్శించాలనే చిత్తశుద్ధి ఉంటే సరైన సమయంలో వెళ్లి ములాఖత్‌ చేసి మాజీ మంత్రిని కలిసేవారని అన్నారు. కావాలనే ఆలస్యంగా వెళ్లి ములాఖత్‌ జరగకుండా చేసి, దాన్నే రాజకీయంగా మలచుకోవడానికి ప్రయత్నించడం జగన్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

ప్రజల సానుభూతిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడమే ఈ యాత్ర అసలు ఉద్దేశమని అచ్చెన్నాయుడు అన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తప్పు చేసి జైలులో ఉన్న వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్లడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటు-న్నారని ప్రశ్నించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర అంతా ఆనందోత్సాహాల్లో ఉన్న సమయంలో ఆ అభివృద్ధిని తట్టు-కోలేక పరామర్శల పేరుతో డ్రామాలు చేస్తూ, అడుగడుగునా బలప్రదర్శనలు నిర్వహించి వైసీపీ అరాచక శక్తులను ప్రోత్సహించారని విమర్శించారు. జగన్‌ పరామర్శ యాత్రలో మరోసారి వైసీపీ నీచ రాజకీయ సంస్కృతి బయటపడిందని, కేవలం రెండు గంటల్లో పూర్తయ్యే ప్రయాణాన్ని ఎనిమిది గంటల పాటు- సాగదీసి కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం కల్పించి వేలాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని మంత్రి అన్నారు.

నిజంగా పరామర్శించాలనే మనసుంటే మాజీ మంత్రి కుమారుడి వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన బీసీ వర్గానికి చెందిన నిరుపేద దానయ్య కుటు-ంబాన్ని పరామర్శించి ఉండాల్సిందని అన్నారు. సిదిరి కుటు-ంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌కు ఇద్దరు చిన్న పిల్లలతో దిక్కులేకుండా మిగిలిపోయిన దానయ్య కుటు-ంబం కనిపించలేదా అని ప్రశ్నించారు. బీసీలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ మాట్లాడుతున్న జగన్‌కు అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో తోట చంద్రయ్య యాదవ్‌, రామయ్యపాలెం గొర్ల గోపాల్‌ యాదవ్‌, నెల్లూరులో వెంగయ్య యాదవ్‌ వంటి అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు జగన్‌ ఒక్కసారైనా వారి కుటు-ంబాలను పరామర్శించారా, వారి పక్షాన మాట్లాడారా అని నిలదీశారు.

పోలీసు దర్యాప్తు పూర్తికాకముందే కుట్ర కాదు, అమాయకుడు అంటూ నిందితులకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడం ఎందుకని ప్రశ్నించిన మంత్రి, కోర్టులు, దర్యాప్తు సంస్థల కంటే జగన్‌ పెద్ద న్యాయమూర్తా అని నిలదీశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన దానయ్య కుటు-ంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచిందని, మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌ స్వయంగా వెళ్లి కుటు-ంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు- ఆర్థిక సాయం అందించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

దేశంలో బాధితుడిని వదిలేసి నిందితుడిని పరామర్శించే ఏ-కై-క నేతగా జగన్‌మోహన్‌ రెడ్డి నిలిచిపోతారు. బాధితుల కన్నీళ్ల కంటే నిందితుల రాజకీయాలకే విలువ ఇచ్చే పార్టీగా గొడ్డలి పార్టీ చరిత్రలో మిగిలిపోతుంది అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.
…..