అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు..

  • ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న 100కు డయల్ చేయండి
  • రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల , ఆంధ్రప్రభ : అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి ఎవరు బయటికి రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న 100 నెంబర్కు దయచేసి సమాచారం అందించినట్లయితే తక్షణమే సహాయ సహకారాలు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు.

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్యాములు పర్యటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎవరు ఆ ప్రదేశాలకు వెళ్లకూడదని హెచ్చరించారు.

ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున ముందస్తు బాధ్యత చర్యలు చేపట్టినట్లు అదేవిధంగా శాఖ పరమైన సూచనలు సలహాలు పాటిస్తూ జిల్లా ప్రజలు సహకరించాలని.. లోతట్టు ప్రాంతాల వద్దకు ఎవరు వెళ్లకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,వంకలు,కాలువలు, నదులు,రిజర్వాయర్లు, చెరువుల వద్దకు నిషేధ ఆజ్ఞలు అందజేశామని, చెట్ల కింద శిథిలవస్తులో ఉన్న భవనాలు లేదా పాడైన నిర్మాణాల వద్ద ఆశ్రయం పొందరాదన్నారు.

విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లను తాకరాదని ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు మీద వద్దన్నాను స్థానిక రెవెన్యూ నీటిపారుదల శాఖ విద్యుత్ ఆర్ అండ్ బి వైద్య శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. వాహనదారులు కల్వర్టులు చిన్నవంతులపై నీరు ప్రవహిస్తున్న సమయంలో దాటేందుకు ప్రయత్నించి రాదని ఎస్బిఐ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.