జగ్గయ్యపేట రోడ్లకు మహర్దశ

జగ్గయ్యపేట రోడ్లకు మహర్దశ

రూ 11.33 కోట్లు మంజూరు

డిప్యూటీసీఎంకు ఎమ్మెల్యే థ్యాంక్స్​

( ఆంధ్రప్రభ జగ్గయ్యపేట)

పంచాయతీరాజ్ శాఖ ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని 7 రహదారుల అభివృద్ధి పనుల కోసం రూ.11.33 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తమ నివాసంలో నిర్వహించిన సమావేశంలో, నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి  కొణిదల పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారుల అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం ఆనందకరమని తెలిపారు. ఈ రహదారుల అభివృద్ధితో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు రైతులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

 గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే  ప్రశంసించారు. అలాగే ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బలమైన మద్దతు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి రాంబాబు, నెల్లూరి శ్రీనివాసరావు, చిట్టూరి రమేష్, చావా నాగేశ్వరరావు, చెన్న బాలకృష్ణ, గుడారు పేరయ్య, మల్లెబోయిన జ్వాల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply