పోలీసులు, పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం..
పోలీసులు, పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం సర్కార్ తోట 6వ డివిజన్లో అనుమతి లేకుండా గృహ నిర్మాణం జరుగుతోందని గుర్తించిన కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు, గత రాత్రి నుంచే కూల్చివేత చర్యలు ప్రారంభించారు. ఈ కూల్చివేత చర్యలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత కొనసాగిస్తుండగా, మచిలీపట్నం వైసిపి పార్టీ ఇంచార్జ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో పాటు పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇనుకుదురుపేట సీఐ పరమేశ్వరరావు వైసిపి శ్రేణుల మధ్య పరిస్థితి ఘర్షణాత్మకంగా మారింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారగా, పోలీసులు భారీగా మొహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
