రాష్ట్ర దశ దిశ మార్చిన యుగపురుషుడు ఎన్టీఆర్

రాష్ట్ర దశ దిశ మార్చిన యుగపురుషుడు ఎన్టీఆర్

గుడివాడ, ఆంధ్రప్రభ : తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నతుడు అన్న ఎన్టీఆర్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ శిఖరాగ్రాన నిలుస్తారన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “జోహార్ ఎన్టీఆర్” అంటూ నినాదాలు చేస్తూ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. మాట్లాడుతూ బలమైన పునాదులతో పార్టీని నెలకొల్పి రాష్ట్ర దశ దిశ మార్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి పేదవర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రంలో గొప్ప సంస్కరణలు తెచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్,తెలుగు ప్రజల చరిత్రలో శిఖరాగ్రాన ఉన్న మహా మనిషి అన్నారు. జయంతి వేడుకల్లో నివాళులు అర్పించడం గర్వంగా భావిస్తున్నాను” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, లింగం ప్రసాద్, చేకూరు జగన్‌మోహన్‌రావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, జనసేన నాయకులు సాయన రాజేష్, బిజెపి నాయకులు అంగడాల సతీష్, యర్రపోతు అర్జున్, టిడిపి నాయకులు వంగపండు ఆదినారాయణ, శైలజ, స్టేడియం కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు, పార్టీ కార్యకర్తలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply