gold-rate-today-july-30-2026-india-24k-22k-prices-rise |పెరిగిన గోల్డ్ రేట్‌.. ఎంతంటే!

  • రెండు రోజుల తగ్గుదలకు బ్రేక్‌..
  • జులై 30న మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
  • అంతర్జాతీయంగా స్వల్ప తగ్గుదల ఉన్నా దేశీయ మార్కెట్‌లో పైపైకి

gold-rate-today-july-30-2026-india-24k-22k-prices-rise ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్ ప్రతినిధి: బంగారం ధ‌ర‌లు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా, జులై 30న మరోసారి పైకి ఎగిశాయి. ధరలు మరింత తగ్గుతాయని ఆశించిన కొనుగోలుదారులకు మార్కెట్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర స్వల్పంగా 0.16 శాతం పెరిగింది.

ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.750 మేర పెరిగింది. ఇటీవల వివాహాలు, శ్రావణ మాసం కొనుగోళ్లు, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.

ఈ రోజు బంగారం ధరలు (జులై 30)

రకం గ్రాముకు 10 గ్రాములకు
24 క్యారెట్లు రూ.14,433 రూ.1,44,330
22 క్యారెట్లు రూ.13,230 రూ.1,32,300
స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ (31.10 గ్రాములు ) 4,046.45 డాల‌ర్లు

నిన్నటితో పోలిస్తే

24 క్యారెట్లు: గ్రాముకు రూ.82 పెరుగుదల, 10 గ్రాములకు రూ.820 పెరిగింది.
22 క్యారెట్లు: గ్రాముకు రూ.75 పెరుగుదల, 10 గ్రాములకు రూ.750 పెరిగింది.

గత 10 రోజుల ధరల ట్రెండ్‌

తేదీ 24 క్యారెట్లు 22 క్యారెట్లు
జులై 30 రూ.14,433 (+82) రూ.13,230 (+75)
జులై 29 రూ.14,351 (-66) రూ.13,155 (-60)
జులై 28 రూ.14,417 (-75) రూ.13,215 (-155)
జులై 27 రూ.14,492 (-1) రూ.13,370 (+85)
జులై 26 రూ.14,493 (0) రూ.13,285 (0)
జులై 25 రూ.14,493 (+60) రూ.13,285 (+55)
జులై 24 రూ.14,433 (-185) రూ.13,230 (-170)
జులై 23 రూ.14,618 (-33) రూ.13,400 (-30)
జులై 22 రూ.14,651 (+229) రూ.13,430 (+210)
జులై 21 రూ.14,422 (+76) రూ.13,220 (+70)

జులై నెల సమీక్ష

జులై నెలలో బంగారం ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. నెల ప్రారంభంలో కనిష్ఠ స్థాయిలో ఉన్న ధరలు, తొలి వారంలోనే గరిష్ఠానికి చేరాయి. ఆ తర్వాత మధ్య మధ్యలో తగ్గినా, నెలాఖరుకు మళ్లీ పెరుగుదలతో ముగిశాయి.

వివరాలు 24 క్యారెట్లు 22 క్యారెట్లు
జులై 1 ధర రూ.14,078 రూ.12,905
జులై 30 ధర రూ.14,433 రూ.13,230
నెలలో గరిష్ఠం రూ.14,700 (జులై 3) రూ.13,475 (జులై 3)
నెలలో కనిష్ఠం రూ.14,078 (జులై 1) రూ.12,905 (జులై 1)

నెల ప్రారంభంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.355, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.325 పెరగడం గమనార్హం. దీన్ని బట్టి జులైలో బంగారం మార్కెట్‌ మొత్తం మీద బుల్లిష్‌ ట్రెండ్‌లోనే కొనసాగిందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

డిజిటల్ గోల్డ్‌లోనూ పెరిగిన రేట్లు

ఫిజికల్‌ గోల్డ్‌తో పాటు డిజిటల్‌ గోల్డ్‌ ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల డిజిటల్‌ గోల్డ్‌ ధర గ్రాముకు సుమారు రూ.14,350 నుంచి రూ.15,300 మధ్య ఉంది. ఇందులో 3 శాతం జీఎస్టీ, ప్రొవైడర్‌ మార్జిన్‌, స్ప్రెడ్‌ ఛార్జీలు కలిసివుంటాయి.

డిజిటల్‌ గోల్డ్‌లోని ప్రధాన ప్రయోజనాలు:

డిజిట‌ల్ గోల్డ్‌లో ప్ర‌ధాన ప్ర‌యోజ‌నాలు ప‌రిశీలిస్తే త‌క్కువ పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశం ఉంది. కనీసం రూ.100తోనే పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉంది. 99.9 శాతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం సురక్షిత డిజిటల్‌ స్టోరేజ్‌
అవసరమైతే నగదు లేదా ఫిజికల్‌ గోల్డ్‌గా మార్చుకునే వెసులుబాటు ఉంది. సుర‌క్షిత‌మైన‌, న‌మ్మ‌క‌మైన యాప్ ద్వారా పెట్టుబ‌డి పెట్టండి.

మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరల్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు కొనసాగినా, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బంగారం ఇప్పటికీ మంచి రక్షణాత్మక ఆస్తిగానే ఉంది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కంటే, విడతల వారీగా కొనుగోలు చేయడం (SIP విధానం) రిస్క్‌ను తగ్గించే మార్గంగా సూచిస్తున్నారు.