శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ఆషాఢ బోనాల (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.
ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు చదివి వినిపించి, ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
