Sushmita Dev Resignation | మమతాకు మరో షాక్..
Sushmita Dev Resignation | మమతాకు మరో షాక్..
Sushmita Dev Resignation | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
సుస్మితా దేవ్ తన నిర్ణయానికి వ్యక్తిగత, రాజకీయ కారణాలను చూపినట్లు తెలుస్తోంది. “ఒకేసారి రెండు పడవలపై ప్రయాణించాలనుకోవడం లేదు” అన్న భావనతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, తన తదుపరి రాజకీయ అడుగు గురించి సుస్మితా దేవ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
రాజీనామా అనంతరం సుస్మితా దేవ్ అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
