కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న యువకులు

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు, ముదిరాజ్ సంఘానికి చెందిన వారు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో జక్కుల వీరయ్య, చొక్కం సంపత్, చొక్కం రమేష్, రాజు, నాగరాజు, అజయ్, లింగనబోయిన రమేష్, ఇట్టబోయిన రాజశేఖర్, రాయగిరి సత్యం, పెద్ద వీరయ్య, మోతే రాహుల్, రంజిత్‌తో పాటు మరో 30 మంది ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుతున్న చేరికలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చిలుపూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, మాజీ ఎంపీపీ బాలరాజు, కొండాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.