ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. తాజాగా మరోసారి ఆయన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. వర్లిలోని రవాణా శాఖ కార్యాలయం అధికారిక నెంబర్ కు వాట్సప్ ద్వారా ఈమేరకు సందేశం వచ్చింది. ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారు. ఈ ఘటనపై వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Threat | కారు బాంబుతో పేల్చేస్తాం… సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు
