SteelPlantAccident | క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

SteelPlantAccident | క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

SteelPlantAccident |
SteelPlantAccident |

SteelPlantAccident | విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వద్దకు వెళ్లిన ఆయన, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఘటన జరిగిన తీరుపై బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వైద్యులు అందిస్తున్న చికిత్స, వైద్య సదుపాయాల గురించి కూడా ఆరా తీశారు.

SteelPlantAccident |
SteelPlantAccident |

ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన వైఎస్ జగన్, అధైర్యపడవద్దని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరిన ఆయన, బాధితుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

click here to read more : 3-Member-Committee : రంగంలోకి కేంద్ర​ కమిటీ Andhra Prabha Spl News

click here to read more :