విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి.. అప్పన్నపల్లిలో విషాదం
దుబ్బాక, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్‌కు గురై ఓ బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.
నంగునూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన చరణ్ తేజ గౌడ్ (11) వేసవి సెలవుల నేపథ్యంలో తన తల్లి స్వగ్రామమైన అప్పన్నపల్లికి ఇటీవల వచ్చాడు. బుధవారం గ్రామంలోని ఇతర పిల్లలతో కలిసి ఆటలు ఆడుకుంటున్న సమయంలో విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు.
ఈ క్రమంలో విద్యుత్ స్తంభంలో ప్రవహిస్తున్న కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాలుడి మృతితో బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
