Rs.187.25cr | అగ్రస్థానంలో ‘ఆర్ఆర్ఆర్’

Rs.187.25cr | అగ్రస్థానంలో ‘ఆర్ఆర్ఆర్’

తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ షేర్ రికార్డులు
టాప్-5 ఫస్ట్ వీక్ షేర్ చిత్రాలు
RRR – రూ.187.25 కోట్లు
పుష్ప 2 – రూ.158.21 కోట్లు
కల్కి 2898 AD – రూ.134.25 కోట్లు
పెద్ది – రూ.125.86 కోట్లు*
సలార్ – రూ.125.65 కోట్లు

Rs.187.25cr | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలుగు సినిమా మార్కెట్ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. పాన్ ఇండియా చిత్రాల జోరుతో తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం వసూళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. భారీ బడ్జెట్‌లు, స్టార్ హీరోల క్రేజ్, విస్తృత విడుదలలతో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన షేర్‌ను సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం (ఫస్ట్ వీక్) అత్యధిక షేర్ సాధించిన చిత్రాల జాబితాలో పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు చోటు దక్కించుకున్నాయి.

ఫస్ట్ వీక్ టాప్-10 షేర్ సాధించిన సినిమాలు

  1. RRR – రూ.187.25 కోట్లు
    దర్శకుడు రాజ‌మౌళి తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం అత్యధిక షేర్ సాధించిన సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది.
  2. పుష్ప 2 – రూ.158.21 కోట్లు
    అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది.
  3. క‌ల్కి – రూ.134.25 కోట్లు
    ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్రలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం మూడో స్థానాన్ని దక్కించుకుంది.
  4. పెద్ది – రూ.125.86 కోట్లు*
    విడుదలైన తొలి వారంలోనే అద్భుతమైన షేర్ నమోదు చేసి అగ్ర చిత్రాల సరసన నిలిచింది.
  5. స‌లార్‌ – రూ.125.65 కోట్లు
    ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.
  6. దేవ‌ర‌ – రూ.123.59 కోట్లు
    జూనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం తొలి వారంలోనే భారీ షేర్ నమోదు చేసింది.
  7. బాహుబ‌లి (The Conclusion) – రూ.117.49 కోట్లు
    భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పటికీ టాప్ జాబితాలో కొనసాగుతోంది.
  8. మ‌న శివ‌శంక‌ర ప్ర‌సాద్ గారు – రూ.113.29 కోట్లు
    చిరంజీవి న‌టించిన మ‌న శివ‌శంక‌ర ప్ర‌సాద్ గారు చిత్రం అంచనాలకు మించి వసూళ్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది.
  9. ఓజీ – రూ.108.22 కోట్లు
    స్టార్ హీరో క్రేజ్‌తో ఈ చిత్రం కూడా వంద కోట్లకు పైగా షేర్ నమోదు చేసింది.
  10. సంక్రాంతికి వ‌స్తున్నాం – రూ.91 కోట్లు
    కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో టాప్-10 జాబితాలో చోటు సంపాదించింది.

గుంటూరు కారం తొలి వారం రూ.87 కోట్ల షేర్‌తో టాప్-10 జాబితాకు చేరువలో నిలిచింది. స్వల్ప తేడాతో జాబితాలో చోటు కోల్పోయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేసింది.