43-year | కేరళలో ఒకరికి పాజిటివ్

43-year | కేరళలో ఒకరికి పాజిటివ్

43-year | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. గిడ్డంగిని శుభ్రం చేసిన 43 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరింత నిర్ధారణ కోసం అతని నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కు పంపినట్లు సమాచారం.

రోగి చికిత్స కోసం పలు ఆసుపత్రులను సందర్శించిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వెంటనే కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించి, బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తిస్తోంది. ఆసుపత్రి సిబ్బందితో పాటు పలువురిని క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. నిఫా వైరస్ కేసు నమోదుతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, వ్యాధి వ్యాప్తి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టింది.

Leave a Reply