600 to 700 | కవిత పార్టీకి చిక్కులు
600 to 700 | కవిత పార్టీకి చిక్కులు
600 to 700 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరుపై వివాదం చెలరేగడంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘టీఆర్ఎస్’ అనే పేరును కొత్త పార్టీకి కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వివాదంలో ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘టీఆర్ఎస్’ అనే పేరు తెలంగాణ ఉద్యమ చరిత్రతో, ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తమ పార్టీని ప్రజలు ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని, కాబట్టి ఆ పేరును మరొక రాజకీయ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదు చేసింది.
మరోవైపు, కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ సంస్థ కూడా ‘టీఆర్ఎస్’ పేరును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇదే కాకుండా, కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటన ఆధారంగా 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ వాదనలు వినిపించేందుకు కవిత ప్రతినిధుల బృందం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసే అవకాశం ఉంది.
