incident | భూవివాదాలే కారణమా..!

incident | భూవివాదాలే కారణమా..!

incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మాస‌బ్ ట్యాంక్ పరిధిలో ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఇవాళ‌ ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మొయినుద్దీన్ కారులో బయల్దేరుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన దుండగులు తమ కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.

ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.