MLA | పై చదువులకు ఆర్థిక సాయం..

MLA | పై చదువులకు ఆర్థిక సాయం..
MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : తుడుం దెబ్బ తొలిదశ ఉద్యమకారుడు దివంగత నేత ఉయిక సంజీవ్ కుమార్తె ఏపీపీఎస్(APPS) చదువు కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలు ఎప్పుడూ ఉన్నత స్తాయిలో ఉండాలని, ఆదివాసీ యువత చదువుల్లో రాణిస్తూ సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఉద్యమ నాయకుడు సంజీవ్ పేరు నిలబెట్టాలని ఆయన కూతురికి సూచించారు.
