17yrsoldgirl | ఈనెల 14న వెకేషన్ బెంచ్‌లో విచారణ

17yrsoldgirl | ఈనెల 14న వెకేషన్ బెంచ్‌లో విచారణ

17yrsoldgirl | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 14న వెకేషన్ బెంచ్‌లో విచారణ జరగనుంది. ఈ వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

17 ఏళ్ల బాలికను వేధిస్తున్నాడంటూ ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ పోలీసులు అదే రోజు మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం. రెండు కేసులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply