24 Indian Languages | కవితా సంపుటికి పురస్కారం

24 Indian Languages | కవితా సంపుటికి పురస్కారం

24 Indian Languages | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు నందిని సిధారెడ్డిని వరించింది. ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం దక్కింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, ప్రజల వేదన, భయం, సంఘర్షణలను ఇందులో కళ్లకు కట్టినట్లు వివరించారు. కాగా నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా పని చేశారు. అలాగే 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది.