11 months | అరుదైన వ్యాధితో బాదపడుతున్నబాలుడు..
11 months |అరుదైన వ్యాధితో బాదపడుతున్నబాలుడు..
రూ.23 లక్షల వైద్య ఖర్చు భరిస్తానని పేరేంట్స్‌కు భరోసా
కడప పర్యటనలో అభ్యర్థనకు స్పందించిన మంత్రి
11 months | అమరావతి, ఆంధ్రప్రభ : వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తానని, ఆ ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు మండలం యామవరం గ్రామానికి చెందిన సాయికుమార్, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు శ్రీవిష్ణు పుట్టినప్పటి నుంచి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. బిడ్డను బతికించుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు ప్రతి మూడు వారాలకు రూ. 16,000 ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న డబ్బు, బంగారు నగలు అమ్మి వైద్యం చేయిస్తున్నారు.

11 months | వైద్యానికి రూ. 23 లక్షల ఖర్చు
అయితే, మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ఆసుపత్రిని సంప్రదించగా, వైద్యానికి సుమారు రూ. 23 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అంత పెద్ద మొత్తం భరించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబం, తమ గోడును విన్నవించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొండాపురం మండలంలో అభివృద్ధి పనులకు వెళ్తున్న మంత్రి లోకేష్‌ను ముద్దనూరులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద బాలుడి తల్లిదండ్రులు కలిశారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన లోకేశ్, బాలుడిని ఎత్తుకొని ఆప్యాయంగా పలకరించారు. “నేను ఉన్నాను.. బాబు ఆరోగ్యం నేను చూసుకుంటాను” అని వారికి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చులకు సాయం అందిస్తానని మంత్రి ఇచ్చిన హామీతో ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. మంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
CLICK HERE TO READ MORE : 1996 Siddayya | బీఆర్ఎస్ నేత దారుణ హత్య
