tvk | మ్యాజిక్ ఫిగర్‌కు చేరిన టీవీకే
tvk | మ్యాజిక్ ఫిగర్‌కు చేరిన టీవీకే
tvk |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీవీకే అధినేత విజయ్‌కు కీలక మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించగా.. తాజాగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు కూడా విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. దీంతో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుతం టీవీకేకు 108 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. కాంగ్రెస్‌కు 5, సీపీఐకి 2, సీపీఎంకు 2, వీసీకేకు 2 సీట్లు ఉన్నాయి. వీరందరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 మ్యాజిక్ నంబర్ టీవీకేకు లభించనుంది.

మరికాసేపట్లో టీవీకేకు మద్దతుపై వామపక్ష పార్టీలు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అలాగే విజయ్ కూడా త్వరలో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు దావా వినిపించే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
