Young People | ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు

Young People | ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు

Young People | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని ఓ ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ ప్రాంగణంలో ఫోటోలు తీయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఘర్షణ చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలోని సకలేశ్‌పుర సమీపంలో ఉన్న ప్రసిద్ధ బెట్టద భైరవేశ్వర ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవిత్ర స్థలంలో ఫోటోలు తీస్తున్నారని, బూట్లు ధరించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ స్థానిక యువకులు ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగారు.

ఫోటోగ్రాఫర్లు మాత్రం తాము బూట్లు ధరించలేదని వివరణ ఇచ్చినా, వివాదం మరింత ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కొందరు యువకులు ఫోటోగ్రాఫర్లపై దాడి చేసి, వారి కెమెరాను ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాడిలో గాయపడిన నవి, నందన్ అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్లను సకలేశ్‌పుర తాలూకా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న సకలేశ్‌పుర రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన ఆశి, ప్రశాంత్, రక్ష, అరవింద్, ఉచిత్, ప్రజ్వల్, నిశాంత్ అనే ఏడుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply