TG BC Students | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మరో రూ.100 కోట్లు
TG BC Students | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మరో రూ.100 కోట్లు
మొత్తం కేటాయింపు రూ.1,000 కోట్లకు పెంపు
బకాయిల విడుదలకు ఉత్తర్వులు..
ఏడాదికి నాలుగు విడతల్లో నేరుగా ఖాతాల్లో జమ
TG BC Students | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద మరో రూ.100 కోట్లను అదనంగా మంజూరు చేసింది. ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయించిన రూ.900 కోట్లకు ఈ నిధులు జత కావడంతో మొత్తం కేటాయింపు రూ.1,000 కోట్లకు చేరింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఈ అదనపు నిధులను మంజూరు చేసినట్లు తెలిపింది.
అలాగే, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రతి ఏడాది నాలుగు విడతల్లో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్–డీబీటీ) కొత్త విధానాన్ని ప్రభుత్వం జీవో నెం.8 (GO-8) ద్వారా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల వేగవంతం కావడంతో పాటు, అర్హులైన బీసీ విద్యార్థులకు నిధులు సకాలంలో అందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
