ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ నాయకుల భాగస్వామ్యం
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం భీంగల్ పట్టణంలోని 162వ బూత్ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంబంధిత బీఎల్ఓతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేయడంతో పాటు, ప్రతి కుటుంబం తమ వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో నమోదు చేయాలని ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భీంగల్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్రమ్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని, సరైన వివరాలు అందించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
