10-Killed-Terror-Attack : ఉగ్ర కలవరం Amdhra Prabha Top News
10-Killed-Terror-Attack : ఉగ్ర కలవరం Amdhra Prabha Top News
- సైనిక శిబిరంపై టెర్రరిస్టుల దాడి
- నలుగురు రేంజర్లు మృతి
- ఆరుగురు ఉగ్రవాదులు హతం
(ఆంధ్రప్రభ, కరాచీ)
10-Killed-Terror-Attack : తన పుట్టలో పెంచిన ఉగ్రపాము తమనే కాటేస్తుంటే… పాకిస్థాన్ తల్లడిల్లిపోతోంది. తాజాగా ఏడుగురు ఉగ్రవాదులు పారామిటటరీ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడి పాకిస్థాన్ లో కలవరం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్థాన్ కరాచీలో సింధ్ రేంజర్స్ పారామిలిటరీ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో రాత్రి సుమారు 8:30 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు రేంజర్స్ సిబ్బంది మరణించారు. భద్రతా దళాల ఎదురుదాడిలో ఆరుగురు ఉగ్రవాదులను హతం కాగ.. మొరొక ఉగ్రవాది గాయపడ్డాడు. అతడిని పాక్ భద్రత దళాలు అరెస్టు చేశాయి.
ఒక వాహనంలో వచ్చిర ఉగ్రవాదులు ప్రధాన గేటు గుండా దూసుకెళ్లి హ్యాండ్ గ్రెనేడ్లు విసిరి కాల్పులు ప్రారంభించారు. రేంజర్లు కూడా ఎదరు కాల్పులు ప్రారంభించారు. సుమారు 90 నిమిషాల పాటుఈ ఎదురుకాల్పులు జరిగాయి, స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ , యాంటీ-టెర్రరిస్ట్ ఫోర్స్ రేంజర్స్ సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు.
నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ వర్గం జమాత్-ఉల్-అహ్రార్ ఉగ్రవాదులుగా హతులను భద్రతా దళాలు గుర్తించాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ఆ సంస్థ కూడా ప్రకటించింది. జువా గతంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పౌరులు, భద్రతా సిబ్బంది ప్రభుత్వ సంస్థలపై దాడులు చేసింది.
ఇక ఆ ప్రాంతాన్ని భద్రత దళాలు దిగ్బంధించాయి, ఇళ్లలోనే ఉండాలని నివాసితులకు సూచించారు. మొత్తం ప్రధాన కార్యాలయాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని దిగ్బంధించాయి. సమీపంలోని రహదారులను మూసివేశారు, నివాసితులను ఇళ్లలోనే ఉండమని సూచించారు. ఆపరేషన్ సమయంలో సమీపంలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. సహాయం చేయడానికి రెస్క్యూ 1122 బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా ఈ ఘటనపై నివేదిక కోరారు. వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆయన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ , కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ (AIG)లను ఆదేశించారు. అంతర్గత వ్యవహారాల మంత్రి జియావుల్ హసన్ లంజర్ కూడా ప్రత్యేక నివేదికను కోరారు.
