Results | ఎల్లుండి ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల
Results | ఎల్లుండి ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల
● జూన్ 30న విడుదల కానున్న ప్రవేశ పరీక్ష ఫలితాలు
● ఇంటర్ వెయిటేజీతో ర్యాంకులు.. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి
Results | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్-2026) ఫలితాలను జూన్ 30న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈసారి ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను రూపొందించడంతో ఫలితాల విడుదల కొంత ఆలస్యమైంది.
ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక ఏపీ ఈఏపీసెట్ వెబ్‌సైట్లో తమ ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు ర్యాంకులు, మార్కుల వివరాలు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
