ఫలించని కరెంట్ స్తంభం మార్పు యత్నం

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 47 వ డివిజన్ కర్మెల్ చెర్చి ప్రాంతం లో ఆదివారం ఒక కరెంట్ స్తంభాన్ని ప్రక్కనే మరో చోట వేయడానికి ప్రయత్నం జరిగింది. కర్మెల్ చెర్చి ఎదురు కొత్తగా నిర్మించిన ఇంటి కి కరెంటు వైర్లు దగ్గర గా ఉన్నాయి అని ఆ ఇంటి యజమాని స్తంభం మార్చడానికి విద్యుత్ శాఖ కు తగిన మొత్తం చెల్లించారు. అయితే ఆ కరెంట్ స్తంభం మార్పు కు కొంతమంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కారణం గతం లో కరెంటు స్తంభం రోడ్డు మార్జిన్ లో ఉంది, ఇప్పుడు కొత్తగా వేసే కరెంట్ స్తంభం రోడ్డు మీద కు వస్తే వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది అంటున్నారు. కరెంట్ స్తంభం మార్చడం వల్ల అందరికీ ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక కరెంట్ స్తంభం మార్చడానికి బదులు కరెంట్ వైర్లు కు ఇన్సీలేషన్ గా ప్లాస్టిక్ గొట్టాలు తొడగాలి అని స్థానికులు సూచిస్తున్నారు. అయితే కరెంట్ స్తంభం మార్చడానికి తీసిన గొయ్యి క్రింద వాటర్ పైప్ లైన్లు ఉండటం తో కరెంట్ స్తంభం మార్పు యత్నం ఫలించలేదు. దాంతో విద్యుత్ శాఖ సిబ్బంది కరెంట్ స్తంభం మార్చకుండా అలా వదిలి వేశారు.