formerCM | స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ
formerCM | స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ
formerCM |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ తో భేటీ అయినట్లు సమాచారం.
ఈ క్లిష్ట సమయంలో తాను స్టాలిన్ వెంటే ఉంటానని, పూర్తి మద్దతు ఇస్తానని రజనీకాంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో స్టాలిన్‌కు ధైర్యం చెప్పడమే లక్ష్యంగా జరిగిన సమావేశంగా భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, ఇతర లెప్ట్ పార్టీలతో కలిసి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది.
